ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక. ఆ తరువాత ‘గీత గోవిందం’ సినిమలో నటించింది. అయితే ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించింది. అదే జోష్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తుంది.ఈ చిత్రం ఈ నెల 26న నాలుగు బాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మేరకు వీరు గట్టిగా ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఒక మాటకి ఫాన్స్ హర్ట్ అయ్యారు.ఈ కన్నడ భామను ఒక రిపోర్టర్ మీరు కర్ణాటకలో లోనే పుట్టారు కదా మరి ఈ సినిమా కన్నడ డబ్బింగ్ మీరే చెయ్యొచ్చు కదా అని అడగగా.. నేను ఇక్కడ పుట్టిన నాకు భాష అంతగా రాదూ అని సమాధానం చెప్పడంతో కన్నడ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్రస్తుతం ఆమెపై విమర్శలు జల్లు కురిపిస్తున్నారు. మరి ఈ మాటలకు ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది అనేది వేచి చూడాల్సిందే.
Tags dear kamrade kannada industry media movies rashmika mandhana seroius tollywood