మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం సోన్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో పచ్చని చెట్లే కీలకమన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత కాపాడటంలో చెట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. వర్షాలు కురిసి భవిష్యత్ తరాలు బాగుండాలంటే మొక్కలు నాటడం తప్పనిసరన్నారు. మొక్కలు నాటాడమే కాకుండా వాటిని పరిరక్షించే భాధ్యతను కూడా తీసుకోవాలన్నారు.
నిర్మల్ పట్టణ శివారులో 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గండి రామన్న హరితవనాన్ని ప్రారంభించిన అటవీ, పర్యావరణ శాఖా మంత్రివర్యులు శ్రీ @IKReddyAllola. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ జి. విఠల్ రెడ్డి పాల్గొన్నారు. pic.twitter.com/zSlHJQx8kZ
— TRS Party (@trspartyonline) July 25, 2019