టీడీపీ గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రానికి సంబంధించిన ప్రతీ శాఖలో అన్యాయమే చేసారని చెప్పాలి. మద్యం పరంగా చూసుకుంటే చంద్రబాబు హయంలో వాళ్ళు చేసిన కుంభకోణం అంతా ఇంత కాదు. ఎందుకంటే బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చి రాజకీయ పరంగా కొన్ని వేలకోట్లు నొక్కేయడం జరిగింది. ఈ బెల్టు షాపుల వల్ల అక్కచెల్లమ్మలు తీవ్ర ఇబ్బందులు పడ్డారనే చెప్పాలి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు.మద్యం వల్ల మానవ సంబంధాలు దూరమయిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ ముందుగా ఇచ్చిన మాట ప్రకారమే అక్కచెల్లమ్మల కన్నీళ్ళు రాకుండా చూస్తానని ఇందులో భాగంగానే బెల్టు షాప్ లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జగన్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. మద్యం అమ్మకాల భాద్యత పూర్తిగా ప్రభుత్వానికే అప్పగిస్తూ కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నామని అన్నారు.