ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో ఈరోజు సాగునీటి రంగం పై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా గోదావరి జలాల పంపకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గారు చాలా మంచి వారని, ఏపీకి రావాల్సిన నదీజలాల విషయంలో హృదయపూర్వంగా సహకరిస్తున్నారని జగన్ సభలో ప్రకటించారు. దీనికి తెలుగుదేశం పార్టీ సభ్యులు, చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.
ఒకానొక సమయంలో గందరగోళం నెలకొంది.. వెంటనే గుంటూరుజిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే అంబటి రాంబాబు లేచి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెయ్యి రెట్లు మంచివారని, గొప్ప నాయకుడని కొనియాడారు. మొత్తం అసెంబ్లీ సభ్యుల హర్షధ్వానాల మధ్య అభివర్ణించారు. కేసీఆర్ గారిని జగన్ గొప్పవారిగా పొగిడితే మీకెందుకు కడుపుమంట అని సూటిగా ప్రశ్నించారు. మిమ్మల్ని చెడ్డవారు అనలేదు కదా.. కేసీఆర్ గారిని మంచిరవారని అంటే మీకెందుకు బాధ అంటూ ప్రశ్నించారు.