నవ్యాంధ్రప్రదేశ్‌లో సువర్ణాధ్యాయానికి నిన్నటి శాసనసభ వేదికైంది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, మహిళలు అన్ని రంగాలలో వివక్షకు గురయ్యారు. ముఖ్యంగా జనాభాలో మెజారిటీ శాతం ఉన్న ఈ సామాజిక వర్గాలు దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ శాతం అధికారం చెలాయించిన కాంగ్రెస్ పాలకులు, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలను ఓటు బ్యాంకుగా చూశారే తప్ప..ఆయా వర్గాల అభ్యున్నతి గురించి పట్టించుకున్న పాపానా లేదు. స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో బీసీలకు రాజకీయంగా అవకాశాలే వచ్చాయే తప్ప, ఆయన కూడా రాజకీయ, అధికార, నామినేటెడ్ పదవుల్లో తన సామాజికవర్గానికే పెద్ద పీట వేశారన్నది ఒప్పుకోవాల్సిన చేదు నిజం.
ఎన్టీఆర్ వచ్చిన తర్వాత తెలుగు నేలపై బలమైన కమ్మ సామాజికవర్గం రాజకీయంగా, ఆర్థికంంగా, సామాజికంగా పెత్తనం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై అణిచివేతలు పెరిగాయి. చుండూరు, కారంచేడు ఘటనలు వీటికి ప్రత్యక్ష నిదర్శనాలు. ఇక ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన అల్లుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పరిస్థితి మరింతగా దిగజారింది. ఎన్టీఆర్ హయాంలో కంటే బాబు హయాంలో కమ్మ సామాజికవర్గం తన ఆధిపత్యాన్ని చాటుకోంది. ప్రభుత్వంలో, నామినేటెడ్ పదవుల్లో, వివిధ ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల్లో కమ్మ సామాజికవర్గ పెద్దలు గుత్తాధిపత్యం వహించారు. బాబుగారు మంత్రివర్గంలో పదవుల దగ్గర నుంచి సాగునీటి ప్రాజెక్టులు, వివిధ కార్పొరేషన్ల పదవులు, నామినేటెడ్ పదవులు, చివరకు రోడ్ల కాంట్రాక్టుల పనుల్లో కూడా తన సామాజికవర్గానికి చెందిన వారికే పెద్ద పీట వేశారన్నది చరిత్ర చెబుతున్న సత్యం.
అయితే 2004లో వైయస్ఆర్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మారింది. వైయస్ పాలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు సువర్ణయుగం. వైయస్ మానసపుత్రిక ఆరోగ్య శ్రీ పథకంతో ఆయా వర్గాల ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి ఎందరో పేద విద్యార్థులు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. వైయస్ చారిత్రక నిర్ణయం…4 % రిజర్వేషన్లతో ముస్లింలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. బీసీల అభ్యున్నతికి వైయస్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించేవారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు వైయస్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం ఎంతగానో తోడ్పడింది.
ఇక రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
బాబు పాలనలో మళ్లీ ఆయన సామాజికవర్గం తన కోరలు చాచింది. రాజధాని పేరుతో ఎందరో అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన రైతుల భూములను అప్పనంగా కొట్టేసిన బాబు గారి సామాజికవర్గం వారి బతుకులను ఛిద్రం చేసింది. గత ఐదేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అన్ని విధాలుగా వివక్షలకు గురయ్యారు. వైయస్ హయాంలో ఆర్థిక స్వావలంబనతో నిలదొక్కుకున్న మహిళల పరిస్థితి మరింతగా దిగజారింది. డ్వాక్రా గ్రూపుల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. మంత్రివర్గంలో కొంత మంది ఎస్సీ, ఎస్సీ, బీసీ, మహిళా మంత్రులు ఉన్నప్పటికి వారు తమ పదవుల కోసం బాబుగారి అడుగులకు మడుగులు ఒత్తుతూ…తమ సామాజికవర్గాల అభ్యున్నతి గురించి ఏనాడు పట్టించుకున్న పాపానా లేదు. బాబుగారి హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల జీవితాల్లో మళ్లీ అంధకారం అలుముకుంది.
వైయస్ఆర్ తర్వాత మళ్లీ ఆయన తనయుడు వైయస్ జగన్ రాకతో అణగారిన వర్గాల జీవితాల్లో మళ్లీ వెలుగులు వస్తున్నాయి. సుదీర్ఘ పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల దయనీయ పరిస్థితిని గమనించిన వైయస్ జగన్..బీసీ డిక్లరేషన్‌తో పాటు, రాజకీయ పదవులు, నామినేటెడ్ పోస్టులు, వివిధ ప్రభుత్వ పనుల కాంట్రాక్టులలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకే కేటాయిస్తానని ప్రకటించారు. అధికారంలోకి రాగానే మాట తప్పని, మడమ తిప్పని జగన్ తన మాట నెరవేర్చుకున్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక బిల్లులు ఆమోదించింది. బీసీ డిక్లరేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను శాసనసభ ఆమోదించింది. ఈ చట్టాలు సమగ్రంగా రూపొందించబడి, దుర్వినియోగం కాకుండా పక్కాగా అమలు అయితే ఎస్సీ. ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగి, స్వయం సాధికారిత దిశగా ఆయా వర్గాలు అడుగులు వేస్తాయనడంలో సందేహం లేదు..ఇంత వరకూ దేశంలో ఏ పాలకుడు బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళల అభ్యున్నతి కోసం ఆలోచించింది లేదు..వచ్చే ఐదేళ్లలో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అట్టడుగు వర్గాల వారు నిండైన ఆత్మగౌరవంతో తలెత్తుకుని సగౌరవంగా బతుకుతారనడంలో సందేహం లేదు…జగన్ నిర్ణయం… దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయం….జయహో జగన్…!