Home / 18+ / ఛీ..ఈ చంద్రబాబు బాబు మారడు…మంచి చేస్తే ఓర్వడు…బీసీ డిక్లరేషన్ బిల్లులను అడ్డుకోవడం సిగ్గుచేటు..?

ఛీ..ఈ చంద్రబాబు బాబు మారడు…మంచి చేస్తే ఓర్వడు…బీసీ డిక్లరేషన్ బిల్లులను అడ్డుకోవడం సిగ్గుచేటు..?

ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఒక గుణం ఉంది. ఒక టాపిక్‌లోఎదుటి వారికి పేరు వస్తుంది అంటే…వెంటనే కుట్రలు మొదలుపెడతారు. ఆ టాపిక్‌ను పక్కన పెట్టి…మరొక టాపిక్‌పై రగడ చేసి, అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తారు. గత అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్…టీడీపీ ప్రభుత్వం అవినీతిపై, అక్రమాలు చర్చ లేవనెత్తగానే…బాబు తన వంధిమాగధులు అచ్చెం, బోండా, దేవినేని ఉమలను ఉసిగొల్పి, 11 సీబీఐ కేసులు, పదహారు నెలలు జైలు, లక్ష కోట్లు అంటూ నానా రగడ చేసి ఇష్యూను పక్కదోవపట్టించే వారు. తాజాగా నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీలో కూడా బాబు బ్యాచ్ మరోసారి కుట్రలకు పాల్పడింది.

 

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక బిల్లులు ఆమోదించింది. బీసీ డిక్లరేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అన్ని నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనులు, సర్వీస్‌ కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, మహిళలకు నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే పనులు, సర్వీస్‌ కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లులను శాసనసభ ఆమోదించింది.

 

ఇది నిజంగా ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయం.. ఇంత వరకు ఏ పాలకుడు తీసుకోని సంచలన నిర్ణయాన్ని జగన్ తీసుకోవడంతో రాష్ట్రమంతటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో సీఎం జగన్‌ను అభినవ అంబేద్కర్‌గా వైసీపీ సభ్యులు కొనియాడారు. ఇది చూసిన చంద్రబాబు జగన్‌కు ఎక్కడ పేరు వస్తుందనే భయంతో తన పచ్చ బ్యాచ్‌ను ఉసిగొల్పారు. చంద్రబాబు ఆదేశాల మేరకు బీసీ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ల అంశాన్ని పక్కదోవ పట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చి నానా రగడ చేశారు.

 

దీంతో నిన్న  శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పెనుదుమారమే రేగింది.  ‘‘సాక్షి పత్రికలోనే 45 ఏళ్లు దాటితే పింఛను అని వచ్చింది. జగన్‌ అప్పుడు ప్రతి సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అది వాస్తవమా కాదా? ’’ అని తెదేపా ఎమ్మెల్యే రామానాయుడు నిలదీశారు. గతంలో జగన్‌ ప్రసంగాల వీడియోలను సభలో ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

చర్చ నడుస్తున్న సమయంలో సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి.. తాను ఎన్నికల ప్రచారంలో  ఏం మాట్లాడానో  చూడండి అంటూ తాను పాదయాత్రలో చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగును సభాపతి అనుమతితో ప్రదర్శింపజేశారు. ‘‘మోసం చేయడం.. అబద్ధాలాడటం మా ఇంటా వంటా లేదు.. ఇది మా మేనిఫెస్టో’’ అంటూ వివరించారు.

 

సీఎం జగన్‌ మాట్లాడిన తర్వాత కూడా తెదేపా సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ఇదే సమయంలో కొందరు తెదేపా సభ్యులు 45 ఏళ్లకు పింఛన్లు ఇవ్వాలని డిమాండు చేస్తూ పోడియంలోకి వచ్చారు. తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడును బడ్జెట్‌ సమావేశాలు ముగిసే దాకా సస్పెండ్‌ చేశారు.

 

అనంతరం సభలోకి వచ్చిన చంద్రబాబు.. 45 ఏళ్లకు పింఛనుపై గతంలో జగన్‌ ఇచ్చిన హామీని ప్రస్తావించారు. అది వారి గెజిట్‌ అయిన సాక్షి పత్రికలోనే వచ్చిందంటూ క్లిప్పింగ్‌ చూపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ జోక్యం చేసుకుంటూ దాన్ని తనకు పంపాలని కోరారు. తాను ఏ సందర్భంలో అలా మాట్లాడానో ఆ తర్వాత వైఎస్సార్‌ చేయూత ఎలా తెచ్చామో వివరించారు.

 

వీడియో క్లిప్పింగ్‌ను మరోమారు ప్రదర్శింపజేశారు. ఆ వీడియో క్లిప్‌లో ” ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏదైనా జ్వరం వచ్చి వారం రోజులపాటు పనులకు పోకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి. వారికి తోడుగా ఉండేందుకే 45 ఏళ్లకే పింఛను ఇవ్వాలని నేను చెబితే వెటకారం చేశారు. ఆ సూచనను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్‌ చేయూత అనే పథకానికి నాంది పలుకుతున్నాను. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన ప్రతి అక్కకు కుటుంబానికి రూ.75వేలు ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి దశల వారీగా, ఆయా కార్పొరేషన్ల ద్వారా అందేలా చూస్తాను’’ అంటూ ఆ వీడియోలో జగన్ ఇచ్చిన హామీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి తెచ్చిన బిల్లులతో తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

 

మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల బిల్లులు అమలులోకి వస్తే ఏపీలో వైయస్ జగన్‌‌కు మరింత ప్రజాదరణ దక్కుతుందనే దుగ్ధతో, మళ్లీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదనే భయంతోనే చంద్రబాబు, తన ఎమ్మెల్యేలను ఉసిగొల్పి 45 ఏళ్లకే పింఛన్ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి నానా రగడ చేయించాడు. దీని బట్టి..చంద్రబాబు ప్రజల ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాడని మరోసారి అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. అంతే కదా…బాబుకు అధికార యావ తప్ప, ప్రజలకు మంచి చేయాలనే తపన ఏ మాత్రం ఉండదు. తాను చేయకపోయినా జగన్ చేస్తుంటే అభినందించాల్సి పోయి..ఇలా అడ్డుకోవడం నిజంగా సిగ్గుచేటు…బాబుగారు తాను మారానని చెప్పుకుంటాడు కానీ..ప్రజలు ఛీకొట్టినా ఏ మాత్రం మారలేదని నిన్న అసెంబ్లీలో తన బుద్ధిని బయటపెట్టుకున్నాను..ఈ బాబు మారడు..అంతే..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat