తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బుధవారం పెద్దఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలస్థాయిలో రక్తదాన శిబిరాలు, పేదలు, వృద్ధులు, అనాథలకు పం డ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. తన పుట్టినరోజున హంగుఆర్భాటాలు, అనవసర ఖర్చులు వద్దని, అవసరంలో ఉన్నవారికి సాయంచేయాలని పార్టీశ్రేణులు, అభిమానులకు కేటీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, అభిమానులు విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు, వయో వృద్ధులకు తమ వంతు సాయం చేస్తున్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముఖ్ర కె గ్రామ వైకుంఠదామంలో గ్రామస్తులు 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.