తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో పండ్లు పంపిణి కార్యక్రమంలో తెరాస రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ బండి రమేష్ గారు, నాంపల్లి ఇంచార్జి ఆనంద్ గౌడ్ గారు,జహంగీర్ పార్టీ సెక్రటరీ, గుడిమల్కాపూర్ మార్కెట్ డైరెక్టర్ సంజయ్ గారు, యూసఫ్, ఇక్బల్, అశోక్ ముదిరాజ్, జాఖిఉల్లాఖాన్ బాసిత్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గోన్నారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ” చిన్న వయసులోనే కేటీఆర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. కేటీఆర్ యువతకు మార్గదర్శి అన్నారు. రాజకీయాల్లో యువతను కేటీఆర్ ఎంతగానో” ప్రోత్సహిస్తున్నారన్నారు.
