ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రోజురోజుకి టీడీపీ మరింత దిగజారిపోతుంది. ప్రజలకు మంచి చెయ్యాలని వైసీపీ చూస్తుంటే టీడీపీ పరువు ఎక్కడ పోతుందో అని ప్రతీ విషయానికి అడ్డు తగులుతున్నారు. నిన్న జరిగిన తీరు చూస్తే.. చంద్రబాబు దృష్టిలో బీసీలు అంటే ఎంత చులకనో మరోసారి తెలిసింది. అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప ఆశయంతో రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పోస్టులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సభలో బిల్లు పెడితే మద్దతు ఇవ్వకుండా బాబు వాకౌట్ చేసాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు జడ్జీలుగా పనికిరారు అని కేంద్రానికి లేఖ రాసి తన కులస్థులను పెట్టుకున్నాడు. అలాంటి మనిషికి ఇప్పుడు ఓటమి చవిచూసిన బుద్ధి రాలేదని అందరు విమర్శిస్తున్నారు.