ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు టీడీపీ నాయకులపై అసెంబ్లీ సాక్షిగా మండిపడ్డారు. సభలో ప్రతీరోజు టీడీపీ ఎమ్మెల్యేలు ఏదోక అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని అన్నారు.ప్రజలకు మంచి చేద్దామని ముందుకు వచ్చినా రోజు ఏదోక ఆందోళన చేస్తూనే ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు.టీడీపీకి ఎంత ఈర్ష్య లేకపోతే , చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుంటే ఏదోక వివాదం తెచ్చి దానిని ఆపడానికే ప్రయత్నిస్తున్నారు తప్పా.. ప్రజలకు మంచి జరుగుతుందని ఆలోచించే నాయకుడు ఒక్కడు కూడా టీడీపీలో లేరని మండిపడ్డారు. చంద్రబాబు పథకం ప్రకారమే ప్రతీరోజు గొడవలు సృష్టిస్తున్నాడని, ఆ పార్టీకి ఎక్కడ చెడ్డపేరు వచ్చి మాకు మంచి పేరు వచేస్తుందో అని భయపడి ఇలాంటి గొడవలు తెస్తున్నాడని జగన్ విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసే దిశగా మేము ముందుకు వెళ్తుంటే టీడీపీ సభ్యులు కనీస భాద్యత లేకుండా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
