తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ పార్టీ శ్రేణులకు,తన అభిమానులకు వినూత్న పిలుపునిచ్చారు. రేపు బుధవారం కేటీఆర్ తన పుట్టిన రోజు జరుపుకోనున్న సందర్భంగా పార్టీ శ్రేణులను,అభిమానులను ఉద్ధేశించి “ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి.జూలై 24న నా పుట్టినరోజు సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ప్రకటనలు, పూల బొకేలపై డబ్బు వృథా చేయొద్దు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని వారి మొహంలో చిరునవ్వును చూడాలి అని ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు..
