ఆదివారం బిగ్బాస్ 3 రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ షోకు హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. నాగ్ ఎంట్రీతో షో మొత్తం హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.అనంతరం హౌస్ లోకి అడుగుపెట్టిన నాగ్ రూల్స్ వివరించడం జరిగింది.ఆ తరువాత ఒక్కొక్క సెలబ్రిటీని ఆహ్వానించాడు.అయితే హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లు ఒక్కరు కూడా అక్కడి రూల్స్ పాటించడంలేదని సమాచారం.తాజాగా వచ్చిన ప్రోమోలో హేమ, హిమజ మధ్య ఏదో విషయంలో చిన్న గొడవ అయినట్టు తెలుస్తుంది.వారి ప్రవర్తన చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండే రూల్స్ ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తుంది.
