Home / POLITICS / తెలంగాణ టార్చ్ బేరర్…కేటీఆర్…!

తెలంగాణ టార్చ్ బేరర్…కేటీఆర్…!

కేటీఆర్…ఈ పేరు ఓ సమ్మోనం, ఓ సింప్లిసిటీ , ఓ ఇన్‌స్పిరేషన్, ఓ హ్యుమానిటీ, ఓ ఉత్తుంగ తరంగం…ఒక రీసెర్చ్ టాపిక్..ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ. తెలంగాణలో గత వారం రోజులుగా పండుగ వాతావరణం నెలకొంది..ఒక పక్క బోనాల సంబురాలు…మరో పక్క కేటీఆర్ బర్త్‌డే సంబురాలు…ఇలా తెలంగాణలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. మామూలుగా రాజకీయ నాయకుల పుట్టిన రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు తమ నాయకులకు భారీగా బొకేలు, పూలమాలలు, గజమాలలు వేస్తూ.. రాష్ట్రమంతటా.. కేకులు కట్ చేస్తూ తమ ప్రియతమ నాయకుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుతారు. కానీ కేటీఆర్..అందరూ రాజకీయ నాయకుల్లా కాదు..తన ప్రతి బర్త్‌డేకు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టద్దు…కేవలం నా పేరు మీద ఒక్క మొక్క నాటండి..లేకుంటే ఒక మొక్క బహుమతిగా ఇవ్వండి అంటూ గత కొన్నేళ్లుగా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఆయనకు పుట్టిన రోజులు ఆడంబరంగా చేసుకోవడం ఇష్టం ఉండదు. తన పుట్టిన రోజున కూడా సమాజహితం కోరుకుంటారు. తన బర్త్‌డే వేడుకలకు బదులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టమని పిలుపు ఇస్తారు. కేటీఆర్ అభిమతం తెలుసుకున్న తెరాస శ్రేణులు, అభిమానులు ఈ సారి #Giftasmilechaleng అనే హ్యాష్ ట్యాగ్‌తో ఒకరికి మనం సాయం చేద్దాం..మరొకరి చేత సాయం చేయిద్దాం..అంటూ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. ఒకరికి సాయం చేసి..మరొకరి చేత సాయం చేయిద్దాం…రామన్నకు బర్త్‌డే గిఫ్ట్ ఇద్దాం అంటూ క్యాంపెయిన్ చేయడం…నిజంగా అభినందనీయం.

కేటీఆర్.. తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కేటీఆర్ గురించి అనగానే కేసీఆర్ తనయుడు, అమెరికాలో ఉన్నత ఉద్యోగం మానేసి తండ్రికి చేదోడువాదోడుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తండ్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జైలుకు కూడా పోయారు. రాష్ట్రం వచ్చే దాకా రాజీలేని పోరాటం చేశారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో తొలుత పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా, తర్వాత ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా పాలనలో సాంకేతికతను జోడించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ఐటీ శాఖ మంత్రిగా దేశ, విదేశాలు తిరిగి హైదరాబాద్‌‌కు ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, యూబర్ వంటి కంపెనీలు తీసుకువచ్చారు…దేశంలోనే ఐటీ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టారు. ఒక్క పాలనలోనే కాదు…రాజకీయాల్లోను తిరుగులేని విధంగా రాణించారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, పాలేరు, నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు…తూటాల్లాంటి డైలాగులు, అదిరిపోయే పంచ్‌లతో మహామహులైన ప్రతిపక్షనాయకులను మట్టికరిపించారు..రెండోసారి టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. మలి ప్రభుత్వంలో ఏ పదవి లేకున్నా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గులాబీ దళాన్ని ముందుకు నడిపిస్తున్నారు..ఇలా కేటీఆర్ నాయకత్వం, సమర్థత గురించి మనందరికి తెలుసు…కేటీఆర్ గురించి చెప్పుకునేది ఇవేనా…అదేం కాదు…ఆయనలో మరో యాంగిల్ ఉంది.

Related image

తెలంగాణలోనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా కేటీఆర్ లాంటి రాజకీయనాయకుడు అరుదుగా ఉంటారు. తన సమర్థత, రాజకీయ చాణక్యం, కార్య దక్షత అంతకు మించి ఆయన చూపే దయ, కరుణ, మానవీయత ఆయన్ని సమకాలీన రాజకీయ నాయకుల్లో విలక్షణంగా నిలిపాయి. పాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెడితే..ఆయన వారసుడిగా సమర్థుడైన నాయకుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా కేటీఆర్ నిలుస్తున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ, ఎప్పుడూ దూకుడుగా కనిపించే కేటీఆర్‌లో మనకు తెలియని మరో కోణం ఉంది…అదే మానవత్వం. ఆయన సాటి మనిషిని ప్రేమిస్తారు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆయన మనసు వెంటనే ద్రవించిపోతుంది. ఆయనది పసిపిల్లాడులాంటి మనసు. ఎక్కడ బాధలు ఉంటే..ఆయన్ని తెలియకుండానే కన్నీటి పొరలు అల్లుకుంటాయి. అడిగిన వెంటనే కాదనకుండా సాయం చేస్తారు..అడగని వారికి కూడా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు..వెంటనే వారికి సాయం చేస్తారు.

Image may contain: 1 person, text

ఒక్క తెలంగాణలోనే కాదు…పక్క రాష్ట్రంలో కూడా ఎవరైనా ఆపదలో ఉంటే…వారికి గుర్తుకువచ్చే దేవుడు…కేటీఆర్. అవును ఇది నిజం.. ప్రాణపాయంలో ఉన్న చదువురాని నిరుపేదలు కూడా తమకు తెలిసినవారితో కేటీఆర్‌కు ట్వీట్ చేయిస్తే చాలు తమ ప్రాణాలు నిలబెడతాయి అన్న ధీమా..కేటీఆర్ అంటే ఒక మానవీయత…ఒక భరోసా. కేవలం ట్విట్టర్ ద్వారానే కొన్ని వందల మంది చిన్నారులకు, పెద్దవారికి, మహిళలకు ఇలా ఎంతో మందికి సాయం చేసి వారి ప్రాణాలు కాపాడిన ప్రాణదాత..కేటీఆర్. ఒక్కసారి ఆయన ట్విట్టర్ పేజీ ఓపెన్ చేస్తే…ప్రతి రోజు ఆయన్ని సాయం కోసం అర్థించే ట్వీట్లే కనిపిస్తాయి. అసలు దేశంలోనే ఏ రాజకీయ నాయకుడి పేజీలో ఇలా సాయం కోసం వచ్చే ట్వీట్లు కనిపించవు..ఒక వేళ వచ్చినా సదరు రాజకీయ నాయకుడు సరిగా పట్టించుకోని పరిస్థితే ఉంటుంది. కానీ కేటీఆర్ ఎంత బిజీగా ఉన్న ప్రతి ట్వీట్‌ను చదువుతారు..వెంటనే రెస్పాండ్ అవుతారు..బాధితుల కష్టాలను క్షణాల్లో తీరుస్తారు. కనీసం కేటీఆర్‌ను కలవడమే కష్టం అనుకునే బాధితులు తమ సమస్యలు తీరగానే వారి కళ్లలో వెలిగే ఆనంద భాష్పాలే… కేటీఆర్‌కు..చల్లని దీవెనలు అనడంలో సందేహం లేదు.

Image may contain: 3 people, people standing and indoor

తెలుగు నేలపై ప్రజల్లోంచి వచ్చి, ప్రజా నాయకులుగా ఎదిగిన రాజకీయ నాయకులు..ఎన్టీఆర్, వైస్ఆర్, కేసీఆర్‌లు మాత్రమే కనిపిస్తారు. ప్రాంతాలకు అతీతంగా వారు అన్ని వర్గాల ప్రజల మనసులు గెల్చుకున్నారు. వారి కోవలోకి చెందిన వారే..కేటీఆర్. ఎందుకు కేటీఆర్ అంటే ప్రజలకు ఇంత అభిమానం..ఎందుకు ఆయన్ని తమలో ఒకడిగా, తమ కుటుంబంలో ఒకడిగా, ఒక పెద్ద కొడుకుగా, ఒక పెద్ద అన్నయ్యగా, ఒక పెద్ద తమ్ముడిగా భావిస్తారు..ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. ప్రతి క్షణం ప్రజల కోసమే ఆయన ఆలోచన. సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే అధికార దర్పం, అహంకారం ఏ కోశాన కనిపించదు. కేటీఆర్ సింపుల్‌గా ఉంటారు. అమెరికాలో ఆపిల్ సీఈవోతో ఎలా మాట్లాడుతారో…అలాగే అడ్డా మీద ఆపిల్స్ అమ్ముకునే నిరుపేదలతో కూడా అలాగే మాట్లాడుతారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురితో ఎలా మాట్లాడుతారో..కూరగాయల మార్కెట్‌లో టమాటాలు అమ్ముకునే అమ్మతో కూడా అలాగే మాట్లాడుతారు…ఆయనకు బేషజాలు లేవు..చిన్నా పెద్దా తారతమ్యం ఉండదు.. పంచ పరమాన్న భక్షాలు తినే స్థాయిలో ఉన్న కేటీఆర్ బస్తీల్లో 5 రూ. భోజనం కూడా పేదలతో కలిసి ఆప్యాయంగా తింటారు.. అందుకే ఆయన ప్రజల మనిషి అయ్యారు..నిజమైన ప్రజా నాయకుడు అయ్యారు.

Related image

ఇక్కడ కేటీఆర్ గురించి చెప్పుకుంటుంటే బాహుబలి సిన్మాలో ఓ సీన్ గుర్తుకువస్తుంది. కాలకేయులతో యుద్ధం సమయంలో బాహుబలి, భల్లాలదేవలు యుద్ధంలో శత్రువులను చీల్చిచెండాడుతారు. ఆ సమయంలో కాలకేయులు ఆ రాజ్య ప్రజలను బందీలుగా పెట్టుకుని
యుద్ధం చేస్తుంటారు. ఆ సమయంలో బాహుబలి ప్రజలను కాపాడుకుంటూనే, కాలకేయుడిని అంతం చేస్తాడు. యుద్ధం తర్వాత రాజమాత శివగామి బాహుబలినే రాజుగా ప్రకటిస్తుంది.. యుద్ధం అంటే శత్రువులను చంపడం కాదు…మన ప్రజలను కాపాడుకోవడం అని..రాజమాత చెబుతుంది. ఇదే కేటీఆర్‌కు వర్తిస్తుంది. ప్రజలు ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడంలో కేటీఆర్ ముందు వరుసలో నిలుస్తారు. దీనికి ఉదాహరణగా కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌‌లో భారీ వరదలు వచ్చి, నిజాంపేట్, బండారీలేఅవుట్ ప్రాంతాలు దాదాపుగా నీట మునిగాయి..దాదాపు 3 రోజుల పాటు ప్రజలు ఇండ్లలోంచి బయటకు రాని పరిస్థితి..నడుం లోతు నీళ్లతో ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టే అధికార యంత్రాంగం నానా తిప్పలు పడింది. ఆ పరిస్థితిలో కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు..వరద ప్రాంతాల్లో స్వయంగా నడుంలోతు నీళ్లలోకి దిగి, సహాయక చర్యలు ముమ్మురం చేయించారు. కేటీఆర్ ఇచ్చిన సూచనలతో అన్ని సహాయక చర్యలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజల ప్రాణాలు కాపాడడమే బాహుబలి అయితే…నిజమైన పొలిటికల్ బాహుబలి..కేటీఆర్ మాత్రమే…

Related image

 

మామూలుగా సినీ సెలబ్రిటీలకు క్రేజ్ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడిగా కేటీఆర్‌కు ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. ఒక్క సారి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లకు వెళ్లి చూడండి…సినీ సెలబ్రిటీలు వెళితే..ఆయా సెలబ్రిటీల ఫ్యాన్స్ మాత్రమే సందడి చేస్తారు. అదే కేటీఆర్ వెళితే…ఐటీ కంపెనీ మొత్తం ఆయన్ని చుట్టుముడుతుంది…వాచ్‌మెన్ల దగ్గర నుంచి కంపెనీ ఎంప్లాయ్‌స్…ఎండీల వరకు ఆయనతో సెల్ఫీలు దిగాలని ముచ్చటపడతారు…ఎందుకంటే ఐటీ దార్శనికుడిగా కేటీఆర్‌‌ను ఐటీ ప్రొఫెషనల్స్ ఇష్టపడతారు.
ఇక్కడ సెల్ఫీలంటే గుర్తుకు వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఒక బస్తీలో ఓ అవ్వతో కేటీఆర్ నవ్వుతూ దిగిన సెల్ఫీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. సొంత మనవడే వచ్చినట్లుగా బోసినవ్వుతో ఆ అవ్వ ముఖం వెలిగిపోతుంటే..సొంత బామ్మ అన్నట్లుగా కల్మషం లేకుండా కేటీఆర్ నవ్వుతూ ఉన్న సెల్ఫీ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది.

Image may contain: 4 people, people smiling, text

కేటీఆర్‌కు ధనిక, పేద తేడా లేదు….పేదలను అన్నా, కాకా, అక్కా, అమ్మా, అవ్వ అంటూ ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడుతారు…అంతే గౌరవిస్తారు. అంతే కాదు..తనపై అస్తమానం విరుచుకుపడే ప్రతిపక్ష నాయకులను కూడా ఆయన గౌరవిస్తారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ ఎన్నికను పురస్కరించుని కేటీఆర్, ఉత్తమ్‌కుమార్, భట్టీల మధ్య జరిగిన సరదా సంభాషణ…తెలంగాణ ప్రజలందరికీ గుర్తు ఉంటుంది. ఎందుకంటే ఆయన మనుష్యులను ప్రేమిస్తారు కనుక. రాజకీయంగా ప్రత్యర్థులే కానీ..తనకు అన్ని పార్టీల నాయకులు మిత్రులే అంటారు కేటీఆర్. పెద్దలు జానారెడ్డి, అరుణక్కా, శ్రీధరన్నా, సీతక్కా అంటూ ప్రతిపక్ష నాయకులను వరుసలు పెట్టి ఆప్యాయంగా పిలుస్తారు కేటీఆర్. అందుకే రాజకీయంగా విబేధించినా, వ్యక్తిగతంగా పార్టీలకతీతంగా కేటీఆర్‌ను అభిమానిస్తారు ప్రతిపక్ష నాయకులు.

 

ఇలా కేటీఆర్ గురించి చెప్పుకుంటే పోతే ఓ గ్రంథమే అవుతోంది. తండ్రికి తనయుడు, కింగ్ ఆఫ్ పొలిటీషియన్, సమర్థుడు, కార్యదక్షుడు, మాస్ అండ్ క్లాస్ లీడర్, ఐటీ దార్శనికుడు, చేనేత ఉద్దారకుడు, ట్రెండ్ సెట్టర్, పీపుల్స్ లీడర్.. ఇవన్నీ పక్కనపెడితే..కేటీఆర్ ఓ సాదా సీదా మనిషి, తన తోటి వారిని ప్రేమించే మనీషీ, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మంచి మనసున్న మారాజు. చివరగా కేటీఆర్ గురించి చెప్పుకోవాలంటే..అరవింత సమేతలో ఓ డైలాగ్‌‌ను గుర్తు చేసుకోవాలి…”ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలుకూ ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు..మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతీ జనరేషన్‌లోను ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకువెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు…వాన్నే టార్చ్ బేరర్ అంటారు..”. సో.. ఫ్యూఛర్ తెలంగాణను ముందుకు తీసుకువెళ్లే ఆ టార్చ్ బేరరే…కేటీఆర్…ఎనీ డౌట్.

Image may contain: 1 person, smiling, selfie and close-up

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat