ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ప్రారంభించిన 54 రోజుల్లోనే అద్భుతాలు చేశారని గవర్నర్ నరసింహన్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. నరసింహన్ రాష్ట్ర బాధ్యతల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అసెంబ్లీలో చక్కటి సభా సంప్రదాయాలను పాటిస్తున్నారని, పాలన ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఆయన టీ 20 క్రికెట్ తరహాలో ప్రతి బాల్‌ను బౌండరీని దాటించడమే కాకుండా సిక్సర్‌లు కొడుతున్నారన్నారు. విజయవాడలోనే తన అక్షరాభ్యాసం, ప్రాథమిక విద్య జరిగిందని నరసింహన్ వెల్లడించారు. మిమ్మల్ని వీడి వెళుతున్నా. మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌తో నాకు విడదీయరాని సంబంధం ఉంది.
విజయవాడలోని అట్కిన్సన్ స్కూల్ లో నా అక్షరాభ్యాసం 1951లో జరిగింది. అప్పట్లో మేం గవర్నర్‌పేట లో నివాసం ఉన్నాం. ఐపీఎస్‌కు ఎంపికయ్యాక ట్రెయినింగ్ అనంతపురంలో నాకు పునర్జన్మ ఇచ్చింది నంద్యాల. ప్రమోషన్ పై నియామకంజరిగింది. నా తల్లిదండ్రులు నాకు అహోబిలం నరసింహుడి పేరు పెట్టారు. అయితే నేను నరసింహుడి పాత్ర వహించానా లేదా? అనేది నాకు అర్థం కాలేదు. ఇక జే అనే అక్షరంతో మొదలయ్యే పేరుగల వ్యక్తి అందరిలో అత్యంత ప్రియమైనవారుగా, ముచ్చటైన వారు గా ఉంటారు. జగన్‌మోహన్ అంటే జగత్తులో మోహనుడు, విశ్వంలో అందరూ ప్రేమించే వ్యక్తి. జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేటపుడు నాకు త్యాగరాజస్వామి కీర్తన ‘నను పాలించగ నడిచీ వచ్చితివా… ఓ రామా.. గుర్తుకొచ్చిందన్నారు