పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో రామ్, పూరికి ఈ చిత్రానికి ముందు సరైన హిట్ లేకపోవడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నమ్మకానికి తగ్గట్టుగానే సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.నిధి అగర్వాల్, నభా నటేష్, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి ఇందులో ప్రధాన పత్రాలు. ఈ చిత్రానికి పూరి, హీరోయిన్ ఛార్మి నిర్మించారు. ఈ చిత్రం సక్సెస్ కావడంతో ఇస్మార్ట్ శంకర్ టీమ్ సక్సెస్ టూర్ వేసారు. ఈ మేరకు కర్నూల్ లో ఆనంద్ కాంప్లెక్స్ మరియు త్రివేణి థియేటర్ లో ఫుల్ హలచల్ చేసి ఫాన్స్ లో మంచి జోష్ తెప్పించారు.