టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,కీపర్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార పద్ధతిలో ట్వీటు చేశాడు. ఇండియన్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్లో ఎంఎస్ ధోనీ శిక్షణ పొందనున్నాడు. ఈ నేపథ్యంలో స్కై స్పోర్ట్స్ క్రికెట్ ధోనిని ఉద్ధేశించి “ధోనీ ఇండియన్ ఆర్మీ పారాచుట్ రెజిమెంట్లో పనిచేసేందుకు విండీస్ టూర్ కు దూరమయ్యాడు”అని వెటకార ట్వీట్ చేశాడు. దీనికి వెటకారంగా కన్నీటితో నవ్వుతున్న రెండు ఎమోజీలను లాయిడ్ పోస్టు చేయగా దీనిపై ధోనీ అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు..
