ప్రస్తుత రోజుల్లో బెండకాయ తింటే లాభాలెంటో తెలుసా.. ఈ లాభాలు తెలియకనే చాలా మంది బెండకాయలను కూరగా కానీ ఫ్రై గా కానీ తినడానికి ఇష్టపడరు. అయితే వీటి లాభాలు ఏమిటో తెలిస్తే వారంలో మూడు రోజులు బెండకాయ సంబంధిత కూరలే తింటారనడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అయితే బెండకాయ తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాం.బెండకాయల్లో ప్రోటీన్,ఫైబర్ ,క్యాల్షియం,ఐరన్ ,జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.బెండకాయ తినడం వలన వీటివలన శరీరానికి పోషక విలువలు అందుతాయి.బెండకాయలను తినడం వలన క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివలన షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. బెండకాయల్లో ఉండే విటమిన్ K ఎముకలను దృఢంగా చేస్తుంది.