నిన్న ఆదివారం బిగ్బాస్ 3 రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ షోకు హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు.నిన్న రాత్రి 9గంటలకు ప్రారంభమైన ఈ షో కి నాగ్ ఎంట్రీ హైలైట్ గా నిలిచింది.అనంతరం హౌస్ లోకి అడుగుపెట్టిన నాగ్ రూల్స్ వివరించడం జరిగింది.ఆ తరువాత ఒక్కొక్క సెలబ్రిటీని ఆహ్వానించాడు.ఈ సందర్భంగా ఫేమస్ యాంకర్ శ్రీముఖి కూడా వచ్చింది.అయితే శ్రీముఖి ని నాగ్ ఒక ప్రశ్న అడిగాడు.అదేమిటంటే వారంరోజులు బిజీగానే ఉంటావు కదా. నీకు ఒక్కరోజు కూడా తీరిక సమయం ఉండదు కదా మరి ఈ షోకి ఎందుకు వచ్చావ్ అని అడిగాడు.దీనికి శ్రీముఖి ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా..ఈ షో యొక్క కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం మరియు పెద్ద అభిమానినని అందుకే అవన్నీ వదిలేసి వచ్చానని చెప్పింది.
