నిన్న ఆదివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెస్టిండీస్ టూర్ కు టీమ్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు మూడు ఫార్మాట్లో కెప్టెన్ గా విరాట్ కోహ్లి నే ఎంపిక చేయడం జరిగింది. అయితే అభిమానులు మాత్రం కోహ్లిని కెప్టెన్ చేయడం పట్ల వ్యతిరేకత చూపుతున్నారు.కోహ్లి కన్నా రోహిత్ శర్మ కు కెప్టెన్సీ ఇస్తే మంచిదని వారి వారి అభిప్రాయలు ట్విట్టర్ వేదికగా చెప్పారు. కోహ్లి సారధ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్తాన్ తో ఓడిపోయం, వరల్డ్ కప్ లో గెలిచే సత్తా ఉన్నా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయామని, ఇక ఐపీఎల్ లో కూడా బెంగుళూరు దారుణం ఓడిపోయిందని, పెద్ద టోర్నీలలో కోహ్లి సారధ్యం పనికిరాదని దీనికి రోహిత్ నే సరైన వ్యక్తి అని అభిమానులు ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు.
