Home / 18+ / హీరోల మధ్య రచ్చ..అప్పుడే మొదలైందా..?

హీరోల మధ్య రచ్చ..అప్పుడే మొదలైందా..?

టాలీవుడ్ హీరోలు మరియు వారి అభిమానులై ఎప్పుడూ గట్టి పోటీనే ఎదురవుతుంది. ఈరోజుల్లో ఫాన్స్ ఎలా ఉన్నారంటే, వారి ఫేవరెట్ హీరోస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఏదైనా ఈవెంట్ జరిగితే చాలు ముందు ఫాన్స్ స్టార్ట్ చేస్తారు అసలు రచ్చ..చివరికి అది కాస్త ముదిరి గొడవలకు దారితీస్తుంది. అయితే ఇదివరకు అయితే ఈ పోటీ పెద్ద హీరోలు వరకే జరిగేది. కాని ఇప్పుడు చిన్న హీరోల సినిమాలకు సంభదించి కూడా వారి ఫాన్స్ అస్సలు ఊరుకోవడం లేదు. నాని, విజయ్‌ దేవరకొండ లాంటి హీరోలు ప్రస్తుతం చిన్న హీరోల్లో అగ్రస్థానంలో నిలబడుతున్నారు.

 

మజిలీతో వచ్చిన నాగ చైతన్య, ఇస్మార్ట్‌ శంకర్‌తో తో రామ్ తాజాగా మంచి ఊపులో ఉన్నారని చెప్పాలి. వీరితో పాటు నితిన్, సాయి ధరమ్‌ తేజ్‌ కొంచెం నెమ్మదిగా ఉన్నా వీరు కూడా అదే రేస్ లో ఉన్నారు. వీరందరూ ఎలాంటి పాత్రలో ఐన సరే న్యాయం చేయగల సమర్ధులు అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం వీరిమధ్య గట్టి పోటీ ఉందనే చెప్పాలి. ఎంత పోటీ అంటే ఎవరైనా డైరెక్టర్ తమ దగ్గరికి వెళ్లి కధ చెబితే వెంటనే ఓకే చేస్తున్నారు ఎందుకంటే కొంచెం లేట్ చేసిన ఆ హిట్ ఛాన్స్ మరొకరికి వెళ్ళిపోతుందని భయం. ఈ విధంగా హీరోలు చాలా జాగ్రత్త పడుతున్నారట.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat