నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,నారా చంద్రబాబు నాయుడుకు వయస్సు అయిపోయింది.బాబు తనయుడు,మాజీ మంత్రి,టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడుకు వాయిస్ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో జరిగిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోయింది.ఇప్పట్లో కానీ భవిష్యత్తులో కూడా టీడీపీ కోలుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. దానికి కారణం చంద్రబాబు వయసు అయిపోతే, లోకేష్ కు వాయిస్ లేకపోవడమేనని ఆయన అన్నారు.దీంతో టీడీపీ నేతల్లో ఆత్మస్థైర్యం దెబ్బ తిందన్నారు.
