యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం టాలీవుడ్ చాలా ఫైర్ లో ఉందని సమాచారం.ఎందుకంటే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రం బాలీవుడ్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని మండిపడుతున్నారు. సైకో సైయాన్ పాటను హిందీలో చిత్రించడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం సాహో చిత్రం రిలీజ్ డేట్ పై టాలీవుడ్ లో అందరు మండిపడుతున్నారు. అయితే ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల అవుతుందని చెప్పగా ఇప్పుడు దీనిని 30కి మార్చేసారు.‘మిషన్ మంగల్’, ‘బాట్లా హౌస్’ సినిమాలతో పోటీ ఎందుకని దీనిని మార్చేశారని అనుకుంటున్నారు.అయితే 15ను ప్రభాస్ కు వదిలేసి మిగతా డేట్స్ లో వేరే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇక ఆగస్టు 30కి డేట్ ఫిక్స్ చేసుకున్న నాని చిత్రం ‘గ్యాంగ్ లీడర్’, సెప్టెంబరు 6న రావాల్సిన వరుణ్ తేజ్ మూవీ ‘వాల్మీకి’ డేట్ మార్చుకోక తప్పట్లేదు.
