తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ నాయకురాలు తోట వాణి మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా సైనికులకు, విజ్ణప్తి. నేను వైసీపీ పార్టీని వీడి వేరే పార్టీలలో చేరుతున్నానని, పెద్దాపురం ఇంచార్జ్ మరొకరికి ఇచ్చారని, నాపై కొన్ని కుట్ర పూరిత అసత్య వార్తలు ప్రచారం చేసి నన్ను భాదిస్తున్నారు.నేను గత 50 రోజులుగా జగన్ అన్న ప్రవేశపెట్టిన పధకాలను, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను కోసం మన నాయకులను, మంత్రులను కలసి ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నానని, టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అప్పటి హోమ్ నిమ్మకాయల రాజప్ప పెద్దాపురం లో చేసిన అవినీతిని ఆధారాలతో సహా మన నాయకులు ముందు పెట్టడం జరిగిందని అన్నారు.
అలాగే ఎలక్షన్ అఫిడవిట్ లో రాజప్ప చేసిన తప్పులను కూడా బయటకు తీసి జగన్ గారి ఆదేశాల మేరకు కోర్ట్ లో కేసు వేయటం జరిగిందని, కోర్ట్ తీర్పు కూడా కొద్దిరోజుల్లో నాకు అనుకూలం గా వచ్చి రాజప్ప అనర్హుడిగా ప్రకటించి నేను ఎమ్మెల్యే అవ్వటం కాయమని, దీనిపై గట్టి పోరాటం చేస్తున్నానని చెప్పారు.నియోజకవర్గం లో ప్రజల కు సేవ చేసే విధంగా వారికి అందుబాటులో ఉంటున్నాను. నాపై విష ప్రచారం చేసి వాళ్ళు లబ్ది పొందాలని చూస్తున్నారు. నా పై లేని పోనీ కుట్రలు చేసి వైసీపీ పార్టీ దెబ్బకొట్టాలనే వారి మాటలు వినకండి అని వాణి చెప్పడం జరిగింది.నేను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ముందుకు వెళ్తాను, పార్టీ కి కట్టుబడి ఉంటాను, పార్టీ లొనే కొనసాగుతాను అని స్పష్టం చేసారు.