గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్ పేమెంట్ సర్వీస్ లానే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ కూడా అడుగుపెట్టనుంది. ఈ మేరకు కావాల్సిన పర్మిషన్లు కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంతకుముందే వాట్సాప్ పేమెంట్ ప్రారంభం కావాలి,కాని కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల అది నిలిపేశారు.అయితే యాప్ యూజర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి చెప్పడంతో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ బ్యాంక్ ఓకే చెబితే వెంటనే ఈ వాట్సాప్ పేమెంట్ సేవలు ప్రారంభమవుతాయి. దేశంలో వాట్సాప్ కు ఎక్కువ యూజర్లు ఉండడంతో ఇది సక్సెస్ అవుతుందని వాళ్ళ నమ్మకం.
