భారత మహిళా జట్టు ప్రత్యేక బౌలింగ్ కోచ్ గా నరేంద్ర హీర్వానిని బీసీసీఐ నియమించింది. మహిళ జట్టు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న వేల స్పిన్ బౌలర్లకు ఉపయోగపడేలా నరేంద్ర హీర్వాణికి బీసీసీఐ ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అయితే అతడు నిరంతరం జట్టుతో ఉండకుండా ఎంపికైన సిరీస్ కి మాత్రమే కోచ్ గా వ్యవహరిస్తాడు.ఎందుకంటే ఆయన జాతీయ అకాడమీలో సభ్యుడు కావున భారత క్రికెటర్లకు ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. భారత్ స్పిన్ విభాగం పటిష్టం అవ్వాలంటే నరేంద్ర సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. నరేంద్ర భారత జట్టు తరపున 17 టెస్టులు, 18 వన్డేలు ఆడి క్రికెట్ కు గుడ్ బై చెప్పి అనంతరం జాతీయ అకాడమీకి సేవలు అందించే పనిలో పడ్డాడు. ప్రస్తుతం మహిళల జట్టులో దీప్తి శర్మ, ఎక్తా బిస్త్, పూనమ్ యాదవ్ వంటి స్పిన్నర్స్ కు నరేంద్ర తోడైతే ఇంకా మంచిగా రాణిస్తారని అంటున్నారు.