ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 81ఏండ్ల షీలా దీక్షిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1998 నుంచి 2013 వరకు 15ఏండ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 మార్చి నుంచి 2014 ఆగస్టు వరకు కేరళ గవర్నర్గా కూడా కొనసాగారు. దివంగత మాజీ సీఎం గురించి మీకు తెలియని మరిన్ని విషయాలు..
ఢిల్లీ దివంగత మాజీ సీఎం షీలా దీక్షిత్ గురించి మీకు తెలియని రహస్యాలు
పంజాబ్ లో కపుర్తలాలో జననం
న్యూఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ స్కూల్ లో కాన్వెంట్ విద్యాభ్యాసం
ఢిల్లీలో డిగ్రీ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి
యూపీలో ఉన్నవో జిల్లా ఐఎఎస్ గా పనిచేసిన వినోద్ దీక్షిత్ తో వివాహం
1984లో కన్నౌజ్(యూపీ)నుండి తొలిసారిగా ఎంపీగా గెలుపు
తొలిసారిగా ఎన్నికై లోక్ సభ ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఎంపిక
1986-89వరకు కేంద్రమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్
1990లోమహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి 23రోజులు జైలు జీవితం
1998లో న్యూఢిల్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది ఢిల్లీ సీఎంగా పదవీ బాధ్యతలు
మూడు వరుస ఎన్నికలలో విజయాన్ని సాధించి రికార్డ్
2013వరకు వరుసగా సీఎంగా పనిచేసిన షీలా
2014 మార్చి నుంచి 2014 ఆగస్టు వరకు కేరళ గవర్నర్
