వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విదేశాంగ కార్యాలయం డిప్లమాటిక్ పాస్ పోర్టును జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఈ పాస్ పోర్టును జారీ చేశారు. ఇప్పటి వరకూ సాధారణ పాస్ పోర్టు కలిగిన జగన్ కు తదుపరి విదేశీ ప్రయాణాల సమయంలో ప్రోటోకాల్‌ను వర్తింప చేసేందుకు వీలుగా ఈ డిప్లమాటిక్ పాస్‌పోర్టును జారీ చేశారు. దీనిని తీసుకునేందుకు జగన్ సతీసమేతంగా విజయవాడలోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. చేతి వేలిముద్రలు, ఇతర వివరాలను అక్కడి అధికారులకు ఇచ్చారు. మరోవైపు వచ్చే నెల 15 తర్వాత ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి అమెరికా వెళ్లనున్నారు. అక్కడ వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం నిర్వహించే సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు.
