తాజాగా అసోంబ్లీలో జరిగిన ఓ ఘటన ఆసక్తిని రేపింది.. సభ్యులందరినీ వరుసక్రమం ప్రకారం కూర్చోవాలని అచ్చెం నాయుడుని కూడా తన సీటులో కూర్చోమని అధికార పార్టీ నేతలు కోరారు.. స్పీకర్ కూడా అచ్చెంను తన స్థానానికి వెళ్లాలని కోరారు. దీనిపై చంద్రబాబు చాలా అసహనం ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులు తమకు నచ్చినట్టు కూర్చునే అవకాశం ఇవ్వాలని, అదే సభా సంప్రదాయమంటూ చెప్పుకొచ్చారు. తన నలభైఏళ్ల అనుభవం ఉన్నందుకు తనకు నచ్చినట్టు నడుచుకునే ప్రివిలేజ్ కావాల్సిందేనంటూ పట్టుబట్టాడు. స్కూల్ పిల్లలు కూర్చున్నట్టుగా నచ్చినచోట, నచ్చినవాళ్లతో కూర్చోవడం కుదరదంటూ స్పీకర్ వారించి అచ్చెం ను వెనుక వరసలో ఆయన సీటుకు పంపించారు. దాంతో అప్పటికే ఆవేశంలో అన్నీ తప్పులు చెప్తూ ఉన్న చంద్రబాబు కవర్ చేసే అచ్చెన్నాయుడు లేకపోవడంతో అసలు నిజాలు చెప్పేస్తానని చంద్రబాబు భయం.. పక్కన అచ్చెం నాయుడు లేకపోవడంతో సభలో బాబుగారి మాటలు తడబడ్డాయి.
అలాగే లింగమనేని గెస్టు హౌస్ తనదేనని, ప్రజావేదిక కూడా తనదేనని చెప్పుకొచ్చారు. వెనుక బెంచ్ కెళ్లిన అచ్చెంనాయుడు ప్రజావేదిక ప్రభుత్వానిదని, లింగమనేని ఇంటిని సొంత ఇల్లుగా చెప్పకూడదని చంద్రబాబుకు వెనక నుంచి చంద్రబాబు సీట్ వరకూ పాకుతూ ముందుకు పడిమరీ చంద్రబాబుకు క్లూ ఇచ్చారు. దాంతో కాస్త సర్దుకున్న చంద్రబాబు తానుంటున్న ఇల్లు కూడా తనది కాదని సవరించుకున్నారు. ప్రజావేదిక ప్రజాధనంతో నిర్మించినా తన పార్టీ అవసరాలకే వాడుకున్నారు. పేరుకు ప్రజావేదిక కానీ బాబుగారి సొంత ఆస్తిలా భావించేవారు. అందుకే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నిజం చెప్పేసారు చంద్రబాబు. అందుకే తనను కంట్రోల్ చేసేందుకు సలహాలిచ్చేందుకే అచ్చంనాయుడిని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. అందుకే పక్కనే కూర్చుని చెవిలో ఊదే అవకాశం లేకపోవడంతో అచ్చెం వెనుకసీటు నుంచే సలహాలివ్వాల్సి వస్తోంది.