తెలంగాణలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ”తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న ఆసరా పింఛన్లను డబుల్ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి విదితమే.గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని దక్కించుకుంది.
ఆ తర్వాత వరుస ఎన్నికలతో కోడ్ ఉండటంతో ఇచ్చిన హామీ నెరవేర్చడానికి కుదరలేదు. తాజాగా ఎన్నికల కోడ్ ముగియ్యడంతో ప్రస్తుతం ఉన్న ఆసరా రూ.1000లను రూ.2,016లకు, రూ.1500లను రూ.3,016లకు పెంచుతూ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది.
దీంతో యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన ఆసరా ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆయా జిల్లాలకు,మున్సిపాలిటీలకు ,నియోజకవర్గాలకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు..