ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. టీడీపీ అధినేత,అప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు అందినకాడికి దోచుకుని పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అప్పటి ప్రతిపక్షం ప్రస్తుత అధికార పక్షం అయిన వైసీపీ ఆరోపిస్తూ పలు ఉద్యమాలు చేయడమే కాకుండా ఏకంగా బాబు అవినీతిపై ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేశారు.
తాజాగా అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ”రానున్న పదిహేను రోజుల్లో తెలుగుదేశం పార్టీ స్కాములు అన్నీ బయటకు వస్తాయని” ప్రకటన చేశారు.నవ్యాంధ్ర ప్రజలకు ఆ వివరాలను అన్నిటిని తెలియచేస్తామని సీఎం అన్నారు.మొదటిసారిగా పోలవరంపై రివర్స్ టెండర్ లకు వెళుతున్నామని ఆయన అన్నారు.
దీనివల్ల పది నుంచి పదిహేను శాతం ప్రభుత్వ దనం ఆదా అవుతుందని భావిస్తున్నామని అన్నారు. నవయుగ కంపెనీకి పనులు చేయకుండానే 700 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ లు ఇచ్చారని ఆయన అన్నారు. పోలవరం పై రోజూ మంత్రి వివరణ ఇస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.సబ్ కాంట్రాక్టుల ముసుగులో నామినేషన్ పద్దతిపై కాంట్రాక్టులు ఇచ్చారని అన్నారు. తమ స్వార్దం కోసం బాబు సభను వాడుకుంటున్నారని ఆయన అన్నారు.