భారత దిగ్గజ కబడ్డీ ఆటగాళ్ళు అనూప్ కుమార్,రాకేశ్ కుమార్ ఏడో సీసన్లో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.ఆటకు వీడ్కోలు పలికిన వీరిద్దరూ కోచ్ లగా మారారు.పునేరి పల్టాన్ కు అనూప్, హరియాణా స్టీలర్స్ కు రాకేశ్ కుమార్ కోచ్ లుగా వ్యవహరించుచున్నారు. రాకేశ్ కుమార్ భారత కబడ్డీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి భారత్ ను విజయపధంలో నడిపించగా.. అనంతరం అనూప్ కుమార్ ఆ భాద్యతలు స్వీకరించారు. వీరిద్దరికీ ఉన్న అనుభవంతో తమ తమ జట్టులకు గట్టి బలం చేకూరుతుందని అందరు భావిస్తున్నారు.