ఐదేళ్ళ టీడీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రరాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పార్టీని 23 సీట్లకే పరిమితం చేసారు.వైసీపీ అధినేత జగన్ ను నమ్మిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.ఈమేరకు జగన్ కూడా ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉన్నారు.అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మాత్రం దౌర్జన్యం గానే ప్రవతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజసాయిరెడ్డి ట్విటర్ వేదికగా చురకలు అంటించారు.అధికారం పోయిన తర్వాత మైండ్ మరింత దెబ్బతిన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం కృష్ణా నది భవానీ ద్వీపం నుంచే మొదలవుతుందట. ప్రకాశం బ్యారేజి కట్టక ముందు లింగమనేని గెస్ట్ హౌజ్ ప్రాంతం నది వెలుపలే ఉండేదట. ఇదేం వాదన బాబూ? అని ప్రశ్నించారు.
అధికారం పోయిన తర్వాత మైండ్ మరింత దెబ్బతిన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం కృష్ణా నది భవానీ ద్వీపం నుంచే మొదలవుతుందట. ప్రకాశం బ్యారేజి కట్టక ముందు లింగమనేని గెస్ట్ హౌజ్ ప్రాంతం నది వెలుపలే ఉండేదట. ఇదేం వాదన బాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 19, 2019