నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క చొక్కా చింపేయడం ఏంటని ఆలోచిస్తున్నారా.. ?. అసలే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న బాబుకు ఆ భద్రతను దాటి మరి వెళ్ళి ఎలా చింపేశారు అని ఆలోచిస్తున్నారా.?. అయితే అసలు ముచ్చట ఏంటంటే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఆయన మాట్లాడుతూ “రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి తప్పా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తెలుగు తమ్ముళ్ళు అందినకాడికి దోచుకుతిన్నారు.
రాజధాని పేరిట దోచుకోవడమే కాకుండా ప్రపంచరాజధానిలా చేస్తామని భీరాలు పలుకుతూ కేవలం గ్రాఫిక్స్ పేరుతో కాలం గడిపారు. ప్రజల్లో తాము నిర్మించబోయే రాజధానిలో ఏదో అయిపోతోందన్న భ్రమ కల్పించారు తప్ప జరిగింది ఏమీ లేదని”కన్నా విరుచుకుపడ్డారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”రైల్వే, హైవేల అభివృద్ధి నిధుల్లో కాంట్రాక్టర్లు నుంచి కమీషన్లు వసూలు చేశారని” ఆరోపించారు. ప్రజలు సైలెంట్‌గా ఓటు వేయటమే కాకుండా చంద్రబాబు చొక్కా చించేశారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజుపాలెం రైల్వేలైన్ పనులు అడ్డుకుని కోడెల కుమారుడు మామూళ్లు వసూలు చేశారని ఆయన చెప్పారు.