పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితానికి దూరంగా ఉంటూ రాజకీయాల వైపు మొగ్గుచూపిన విషయం అందరికి తెలిసిందే.అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఘోరంగా ఓడిపోయాడు. కేవలం ఒకేఒక సీటు గెలిచాడు అది కూడా పవన్ కళ్యాణ్ గెలిచింది కాదు.తాను పోటీ చేసిన రెండు చోట్ల ఘోర పరాజయాన్ని చవిచూశాడు.పవన్ తన హీరో ఫాలోయింగ్ తో గెలిచేయోచ్చు అనుకునట్టునాడు చివరికి మాత్రం బొక్కబోర్లపడ్డాడు.అయితే అతను తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ని మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో గా చూడటానికి ఇష్టపడతారు తప్ప రాజకీయపరంగా ఎవరూ లెక్కచెయ్యరు అని తెలుసుకోవాలి.
ఇంక అసలు విషయానికి వస్తే పవన్ ఈ మధ్య తన రాజకీయ అవసరాలకోసం డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తన పబ్లిక్ అప్పీరన్స్ కి డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నాడట.ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ లో జరిగిన నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ వేడుకకి పవన్ హాజరయ్యాడు.అయితే పవన్ సినిమాలకు దూరంగా ఉన్నాడు కాబట్టి మిగతా నటులు లాగా కాకుండా హాజరయ్యారని అందరు అనుకున్నారు కాని తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అది పెయిడ్ అప్పీరన్స్ అని తెలిసింది.పవన్ తానా ఈవెంట్ కు 50 వేల డాలర్లు తీసుకునట్టు తెలుస్తుంది.