ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా సభ ప్రారంభం కాగానే పోలవరంపై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్ ని అధికారపక్షం పట్టించుకోలేదు. పోలవరంపై చర్చకు అనుమతినివ్వలేదు.. కారణం.. గత మూడు రోజులుగా అసెంబ్లీలో నిత్యం పోలవరంపై చర్చ జరుగుతోదిం. అయినా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించాలని స్పీకర్ ఎంతసేపు కోరినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు.
ఈ సమావేశాల్లో పోలవరం పై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు ఆందోళన చేపట్టడాన్ని తప్పుబట్టారు. టీడీపీ నేతల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీరంతా సీనియర్ మెంబర్స్.. ఒక ప్రశ్నను ఎంతసేపు లాగుతారు.? ఎంతకీ తృప్తి చెందకపోతే ఏ ప్రభుత్వం కూడా రిప్లై ఇవ్వలేదు.. మిగిలిన సభ్యుల సమయాన్ని మీరు వృథా చేస్తున్నారు.. కాబట్టి నేను అన్నివేళలా ఇటువంటివాటికి అనుమతివ్వను’’ అంటూ స్పీకర్ మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవద్దన్నారు. అయినా టీడీపీ నేతలు వినిపించుకోకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. బుగ్గన మాట్లాడుతూ టీవీల్లో షో అప్ కోసం, పత్రికల్లో ఫొటోలకోసం ఈ విధంగా అనవసర రచ్చ చేస్తున్నారంటూ చురకలు అంటించారు.