టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ లో తన స్థానం పట్ల సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైన ఉందని భారత్ మాజీ ప్లేయర్ ,బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు.తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎంతోమంది యువక్రికెటర్లకు మంచి అవకాశాలు కల్పించాడని అన్నారు.ఆస్ట్రేలియా సిరీస్ కు సచిన్, సెహ్వాగ్ తో పాటుగా నాకు కూడా అవకాశం కల్పించాలని కోరినట్లు చెప్పాడు. 2023 వరల్డ్ కప్ కు ఇప్పటినుండే కసరత్తు చెయ్యాలని రిషభ్‌పంత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి పరిశీలించాలని చెప్పాడు.
