వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడి కేసు నిందితుడికి బెయిల్ రద్దయింది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నిందితుడి బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్ఐఏ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. దీంతో అతడి బెయిల్‌ను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై గతేడాది అక్టోబర్ 25న కోడికత్తితో దాడి చేసిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుడు శ్రీనివాసరావును విమానాశ్రయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ కేసును హైకోర్టు ఎన్ఐఏకు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే గత నెల 23న అతడికి విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
