1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో టీమిండియా ప్రపంచ కప్ ను గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్ధాల అనంతరం మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ,ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అయితే నాడు కపిల్ నేతృత్వంలో వరల్ద్ కప్ సాధించిన టీమిండియా ఆటగాళ్ల పారితోషికం ఎంతో తెలుసా.. ?
ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు పారితోషికం కోట్లు దాటుతున్న నేపథ్యంలో అప్పుడు కూడా ఇంతే ఇచ్చే ఉంటారని అనుకుంటున్నారా.. పోనీ కోట్లు కాకపోయిన లక్షలైన ఇస్తారు అని భావిస్తున్నారా.. అయితే మీ ఊహాలన్నీ కట్టిబెడితే అప్పుడు ఆడిన ఆటగాళ్లకు ఇచ్చిన పారితోషికం అక్షరాల రూ.2100లు. కెప్టెన్ కపిల్ దేవ్ దగ్గర నుండి జట్టు మేనేజర్ బిషన్ సింగ్ బెడీ వరకు ఇదే పారితోషికం ..