ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.అయితే ధోని రనౌట్ తో టోర్నీ నుండి ఆ జట్టు నిష్క్రమించిందని చెప్పాలి.ఇప్పుడు అందరు ధోనిపైనే పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మిస్టర్ కూల్ వయస్సు 38సంవత్సరాలు కాగా ఇప్పుడు అతడి ఆట అంతగా దూకుడుగా లేదని ఎన్నో విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం ప్లేయర్స్ అందరు రెస్ట్ తీసుకుంటున్నారు.వెస్టిండీస్ సిరీస్ కి గాను రేపు సెలక్షన్ జరగనున్న సమయంలో ధోని ఉంటాడా లేదా అనేది స్పష్టత లేదు.ఇంకో పక్క ధోని తన రిటైర్మెంట్ పై క్లారిటీ కుడా ఇవ్వలేదు..దీంతో ఉంటె 15మంది స్క్వాడ్ లో ఉంటాడనే అంటున్నారు.అయితే కొంతమంది సీనియర్లు మాత్రం సెలక్షన్ కమిటీ కి చురకలు అంటిస్తున్నారు.ధోని ఒకవేళ ఉంటే కీపర్ బాట్స్ మెన్ గా ఉండాలి తప్ప 15వ ఆటగాడిగా అయితే ఉపయోయోగం ఏమి ఉండదని అంటున్నారు.ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే స్వయంగా ధోనినే అడిగి తెలుసుకోవడం మంచిదని సెహ్వాగ్,గంభీర్ సూచించారు.మరోపక్క కనీసం 50 వన్డేల అనుభవం లేని సెలక్టర్లు.. 350 వన్డేల అనుభవం ఉన్న ధోనీని ప్రశ్నించగలరా? అని విమర్శలు గుప్పిస్తున్నారు.