తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని అవ్వ తాతకు ముఖ్యంగా ఆసరా పింఛన్ల దారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెంచిన పింఛన్లను ఈ నెల ఇరవై తారీఖు నుండి నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పింఛన్ల వయోపరిమితి యాబై ఏడు ఏండ్లకు తగ్గించినట్లు సర్కారు ప్రకటించింది. వెంటనే యాబై ఏండ్లు ఉన్న అర్హులైన పింఛన్ల దారుల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అవ్వ తాతకున్న రూ. వెయ్యి పింఛన్ ను రెండు వేల పదహారు రూపాయలకు.. దివ్యాంగులకు,వృద్ధ కళాకారులకు రూ. 1500ల నుండి మూడు వేల పదహారు రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల సమయంలో హామీచ్చిన సంగతి విదితమే.