ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం 15వ తేదీన అర్ధరాత్రి తరవుత అంతరిక్షంలోకి పంపాలని అనుకోగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు సిబ్బందని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చంద్రయాన్-2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది.ఈ ప్రయోగం జులై 22(సోమవారం) మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నాం’ అని ఇస్రో ట్వీట్ చేసింది.
