ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆమెజాన్ సీఈవో జెఫ్‌బెజోస్ తన మొదటి స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండిక్స్ విడుదలైన తాజా జాబితాలో ఆయన ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకున్నారు.ఇక ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు ఈ సారి ఉహించని విదంగా షాక్ తగిలిగింది.ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 108 బిలియన్ డాలర్లుతో బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానం కైవసం చేసుకోగా..బిల్ గేట్స్ 107 బిలియన్ డాలర్లుతో మూడో స్థానంలో ఉన్నాడు. జెఫ్‌బెజోస్ మాత్రం 125బిలియన్ డాలర్లతో తొలిస్థానంలో నిలిచారు.ఇక మహిళల పరంగా చూసుకుంటే మెకంజీ 4వ స్థానంలో ఉన్నారు.ఇక భారత విషయానికి వస్తే ముకేష్ అంబానినే మళ్ళీ మన కుబేరుడు. 51.8 బిలియన్ డాలర్లుతో భారత్ లో అగ్రస్థానంలో ఉండగా..ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో ఉన్నాడు.