టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై ఫైర్ అయ్యారు. లోకేష్‌లా తాను దొడ్డి దారిన రాజకీయాల్లోకి రాలేదన్నారు. దేవుడి సొమ్ము ఒక్క రూపాయి కూడా తాకబోనని, అవసరమైతే తాన చేతి నుంచే పదిమందికి సహాయం చేస్తానని చెప్పారు. అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్న కారణంగా అక్కడ ఒక ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరానే తప్ప.. ప్రత్యేకంగా చైర్మన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని తాను ఆదేశించలేదని స్పష్టం చేశారు.
