తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ రికార్డు స్థాయిలో కొనసాగుతున్నది. చాలాచోట్ల లక్ష్యానికి మించి చేపడుతున్నారు. పార్టీ నా యకులు, కార్యకర్తలు ప్రత్యేక శిబిరాలు ఏర్పా టు చేయడమేగాకుండా పలుచోట్ల ఇంటింటికి వెళ్లి సభ్యత్వాలను అందజేస్తున్నారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్యపురి డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డి, ఇంచార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. ఈ సం దర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్పొరేటర్లు బాధ్యతగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు అవకాశం ఉన్నదన్నారు. గతం లో మాదిరిగా సభ్యత్వ నమోదులో ఎల్బీనగర్ నియోజకవర్గం నంబర్‌వన్ గా నిలువాలని సూచించారు.
మేడ్చల్ పట్టణంలో మంగళవారం చేపట్టిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో లక్ష మందికిపైగా సభ్యత్వాన్ని కల్పిస్తామన్నారు. అదిష్ఠానం పిలుపుమేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేపట్ట డం అభినందనీయమన్నారు. ప్రతి నాయకు డు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఇంటింటికి తిరిగి చేపట్టడంతో లక్ష వరకు సభ్యత్వాలను చేపట్టగలుగుతున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ్యత్వ నమోదుకు భారీ స్పందన వస్తున్నదని వారు పేర్కొన్నారు. గ్రామాల్లో స్థానికులతోపాటు రైతులు ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని తెలిపారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్లెమోనిగూడలో నిర్వహించిన సభ్యత్వ నమోదులో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం గ్రామాల్లో పండుగ వాతావరణంలో కొనసాగుతున్నదన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో మార్క్‌ఫెడ్ చైర్మన్, బాల్కొండ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జి లోక బాపురెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వాలు తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు.By NT