చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలకు ఏమీ చేసింది లేదు.ప్రజల సొమ్ము మొత్తం తన సొంత ప్రయోజనాలకే ఉపయోగించారు తప్ప రాష్ట్రానికి చేసింది మాత్రం శూన్యం.వైసీపీ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు.పోలవరంలో అవినీతి, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాల పైన కేంద్రం నుంచి క్లీన్ చిట్ వచ్చినట్టు మురిసి పోతున్నారు పచ్చదొంగలు. నాలుగు రోజులు ఓపిక పట్టండి అన్నీ బయట పడతాయి. దోచుకున్న వేల కోట్లు కక్కిందాకా ప్రభుత్వం వదిలి పెట్టదు.పోలవరంపై రాజ్యసభలో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి చెప్పిన జవాబును చంద్రబాబు గారికి సరిగా బ్రీఫ్ చేసినట్టు లేరు. ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. సీబీఐ రంగంలోకి రాదని మురిసి పోతున్నారేమో బాబు గారు అని చెప్పుకొచ్చారు.