ఏపీ ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారానికి ముందే తన వద్దకు వచ్చిన వైసీపీ అధినేత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన తొలి విజప్తి పైన ముఖ్య అడుగు వేస్తునట్లు తెలుస్తుంది. .ప్రధాని తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రికి భారీ ఉపశమనం కలిగిస్తోంది. ఏపి విభజన సమయంలో రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఆ తరువా త దీని పైన నాటి యుపీఏ చివరి కేబినెట్ సమావేశంలోనూ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా నాటి బీజేపీ ప్రధాని అభ్యర్ది మోదీ ఏపీలో తాము హోదా ఇస్తామని ప్రకటించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ స్వరంలో మార్పు వచ్చింది. 14 ఆర్దిక సంఘం కొత్తగా ఎవరికీ కొత్తగా హోదా ఇవ్వద్దని చెప్పిందని..దీని కారణం గా కేంద్రం చెబుతూ వచ్చింది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలో స్వయంగా ప్రధాని కార్యాలయం ఏపీకి ప్రత్యేక హోదా అంశం పైన 15వ ఆర్దిక సంఘానికి ప్రతిపాదన అందించింది. ప్రమాణ స్వీకారినికి ముందే ప్రధానిని కలిసి ఏపీకి ప్రత్యేక హోదా పైన నిర్ణం తీసుకోవాలని అభ్యర్దించారు. అదే విధంగా అమిత్ షాను కోరారు. నీతి అయోగ్ సమావేశం లోనూ విజ్ఞప్తి చేసారు.
ఇక, తాజాగా లోక్‌సభలో వైసీపీ ఎంపీ వంగా గీత హోదా పైన అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కీలక సమాధానం ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మే 26న ప్రధాని మోదీని కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని 15వ ఆర్దిక సంఘానికి నివేదించినట్లు మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. దీని ద్వారా హోదా అంశం కీలక మలుపు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 14వ ఆర్దిక సంఘం నో చెప్పటంతోనే ఏపీకి హోదా ఇవ్వలేదంటూ కేంద్రం చెబుతూ వచ్చింది. అయితే, 14వ ఆర్దిక సంఘం అలా చెప్పలేదని ఏపీలోని పార్టీలు వాదిస్తున్నాయి. ఈ సమయంలో తిరిగి 15వ ఆర్దిక సంఘానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వినతులతో పాటుగా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఏపీకి హోదా పైన నివేదించటం కీలక మలుపుగా భావిస్తున్నారు. దీని పైన రాజకీయంగా మరింత ఒత్తిడి పెంచితే సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోపక్క రాజకీయం గా ఏపీలో బలోపేతానికి ఇప్పుడున్న పరిస్థితులు తమకు అనుకూలంగా బీజేపీ భావిస్తోంది. ముందుగా ఏపీకీ హోదా ఇస్తేనే తమ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావం పోతుందని అంచనా వేస్తోంది. ఈ కోణంలో ఆలోచన చేసినా..తొలుత హోదా మీద సానుకూల నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. మరి..హోదా దక్కేలా..రాజకీయంగా బీజేపీని ఎదుర్కొంటూ నిలబడేలా జగన్ ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది.