రేపటి నుండి రెండు రోజులు జరిగే శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల నిర్వాహణపై పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. ఈరోజు శాసనసభ లోని స్పీకర్ చాంబర్ లో నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశంలో శాసనసభ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగినంత మంది పోలీసు శాఖ సిబ్బందిని నియమించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు శాసనసభ పరిసరాలలో వాహనదారులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని స్పీకర్ గారు సూచించారు.