తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెట్టిన పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్స్ సత్ఫలితాలిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా శిశుమరణాలను చాలా వరకు తగ్గుమొఖం పట్టాయి. మెటర్నీటీ మోర్టాలిటీ ఇండియా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్)ద్వారా విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రసూతి మరణాల శాతం,నవజాత శిశువుల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయని తెలిపింది.
బంగారు తెలంగాణలో భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన నవజాత శిశువులను అందించి ఆరోగ్య సమాజాన్ని సాధించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపట్టారు. వీటిలో ముఖ్యమైన పథకం కేసీఆర్ కిట్స్ . రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయం గా పెరుగుతున్నది. గతంలో ప్రభు త్వ దవాఖానల్లో 25% ఉన్న ప్రసవాలు కేసీఆర్ కిట్స్ పథకం అమలుతో 57 శాతానికి పెరిగినట్టు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో మాతాశిశు మరణాలను నియంత్రించడంలో భాగంగా ప్రభు త్వం కేసీఆర్ కిట్స్-అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది.