తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కావాలని కొందరు నాపై కుట్ర పన్ని పార్టీ మరతున్నాడంటూ ద్రుష్పచారం చేస్తున్నారని మాజీ మంత్రి జూపల్లి అన్నారు. నేను పూటకో పార్టీ,రోజుకో పార్టీ మార్చే వ్యక్తిని కాదు.. పార్టీ మారె ప్రసక్తే లేదు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే ద్రుష్పచారం చేస్తున్నారు.అని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ లోనే ఉంట. నిబద్ద గల నిఖార్సయిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడినని..వందశాతం టిఆర్ఎస్ పార్టీ లొనే ఉంటానని ఆయన అన్నారు. అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గా ఓడిపోయిన కొల్లాపూర్లో ప్రజల మధ్యలొనే ఉన్న. పార్టీ మారుతాడంటూ నా ప్రతిష్ఠని మసకబర్చేందుకు చేస్తున్న ప్రచారం ఇది. అని జూపల్లి మండిపడ్డారు.