ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఉత్కంట భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు ఆతిధ్య జట్టే విజయం సాదించింది.అయితే ఈ విజయంపై ఇప్పటికే చాలా అనుమానాలు వస్తున్నాయి.అయితే దీనిపై స్పందించిన జిమ్మీ ఆండ్రీసన్ ఓ ప్రకటనలో మాట్లాడగా..ఫైనల్ మ్యాచ్ ఫైనల్ ఓవర్ గుప్తిల్ వేసిన త్రో బాట్స్ మెన్ బ్యాట్ కి తగలడంతో అది బౌండరీకి వెళ్ళింది దీంతో అంపైర్ ఆరు పరుగులు ఇవ్వడం జరిగింది.ఆ సంఘటన జరిగిన వెంటనే బెన్‌స్టోక్స్ అంపైర్ వద్దకు వెళ్లి ఆ పరుగులు మాకు వద్దు అని చెప్పినట్టు జిమ్మీ చెప్పుకోచాడు.కాని అంపైర్ మాత్రం రూల్స్ ఇలా ఉండడం వల్ల అలా చేయడం కుదరదని చెప్పాడట.